‘టెంపర్’ రీమేక్ గా ‘అయోగ్య’…..

టాలీవుడ్ రొమాంటిక్ దర్శకుడూ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన ‘టెంపర్’ సినిమా, మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాను తమిళంలో విశాల్ హీరోగా ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేశారు. ఇటీవలే అక్కడ విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లనే సాధించింది .. విశాల్ ఖాతాలో మరో హిట్ ను వేసేసింది. తెలుగు సినిమా రీమేక్ కనుక తెలుగులోకి డబ్ చేయమని ఒక సందర్భంలో విశాల్ చెప్పాడు. కానీ తాజాగా ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ సినిమాకి సంబంధించి కథలో చివరి అరగంటలో చాలా కీలకమైన మార్పులు చేశారట. మార్చబడిన క్లైమాక్స్ కి అక్కడ మరిన్ని మార్కులు పడ్డాయట. అందువలన ఈ సినిమాను తెలుగులోకి అనువదించడం వలన, క్లైమాక్స్ లోని కొత్త కిక్ అభిమానులను ఆకట్టుకుంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.Image result for vishal

Leave a Response