కామెడీ తో వస్తున్న విక్టరీ…

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ సినిమాలలో చేసే కామెడీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఫం౨ సినిమా తరువాత ‘వెంకీమామ’ సినిమాతో మల్లి అభిమానులను అల్లారించడానికి వస్తున్నాడు. బాబీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కూడా పూర్తి వినోదభరితంగా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే వెంకటేశ్ చేసే మరో ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. నక్కిన త్రినాథరావుతో Image result for venkateshకలిసి వెంకటేశ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా కామెడీ ప్రధానంగా సాగనుందని చెబుతున్నారు. ‘సినిమా చూపిస్తమావ’ .. ‘నేను లోకల్’ వంటి సినిమాలు చేసిన నక్కిన త్రినాథరావు, ఈ సినిమాను కూడా అటు యూత్ ను .. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా ఉంటుందని చెప్పారు.

Leave a Response