టాలీవుడ్ అంత ‘మహర్షి’ సినిమాను గురించి, దర్శకుడు వంశీ పైడిపల్లిని గురించే మాట్లాడుకుంటున్నారు. వంశీ పైడిపల్లికి ప్రభాస్ తో హిట్ కొట్టలేకపోవడమే అసంతృప్తిని కలిగిస్తుందేమో, ఆయనకి తప్పకుండా హిట్ ఇస్తాను అని చెప్పారు. వంశీ పైడిపల్లి మొదటి సినిమా హీరో ప్రభాస్. ‘మున్నా’ టైటిల్ తో 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పరాజయం పాలైంది. తాజా ఇంటర్వ్యూలో వంశీ పైడిపల్లి ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ, ” సాధారణంగా కొంతమంది హీరోలు తమకి ఫ్లాప్ ఇచ్చిన దర్శకులను పక్కకి పెట్టడం .. తక్కువగా చూడటం చేస్తుంటారు. కానీ నన్ను ప్రభాస్ ఎప్పుడూ అలా చూడలేదు. ఆయన నాతో ఎంతో ఆత్మీయంగా .. గౌరవంగా వుండేవాడు. అలాంటి ప్రభాస్ కోసం త్వరలో మంచి స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తాను .. ఆయనను ఒప్పించి ఒక సూపర్ హిట్ మూవీ చేస్తాను” అని చెప్పుకొచ్చాడు.
previous article
100 కిలోల బరువును ఎత్తిన సమంతా…
next article
రకుల్ గ్లామర్ కి మంచి మార్కులు…
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment