రకుల్ గ్లామర్ కి మంచి మార్కులు…

బాలీవుడ్ యాంగ్ హీరో అజయ్ దేవగణ్ సరసన హీరోయిన్ గా ‘దే దే ప్యార్ దే’ సినిమాలో రకుల్ నటించిందని సంగతి తెలిసిందే. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను దేశవ్యాప్తంగా 3100 స్క్రీన్లలో విడుదల చేశారు. తొలి రోజున ఈ సినిమా 10.41 కోట్లను మాత్రమే రాబట్టడంతో రకుల్ డీలాపడింది. అయితే రెండవ రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు పుంజుకోవడంతో రకుల్ మనసు కుదుటపడింది. నిన్నటితో ఈ సినిమా 50 కోట్ల మార్క్ ను అందుకోవడంతో, రకుల్ తేలికగా ఊపిరి పీల్చుకుందట. రకుల్ గ్లామర్ కి ఎక్కువ మార్కులు పడుతుండటం ఆమెకి మరింత సంతోషాన్ని కలిగిస్తోందట. మరి రకుల్ ఆశించినట్టుగానే వరుసగా అక్కడ అవకాశాలు వస్తాయేమో చూడాలి.Image result for rakul preet singh

Leave a Response