టాలీవుడ్ సీనియర్ హీరో కమలహాసన్ తనయ శృతీహాసన్. తన నటితో టాలీవడ్ లో తన సత్తా చూపింది ఈ అమ్మడు. మరో సుందరి మన మిల్కీ బ్యూటీ తమన్నా. ఇక ఆశలు విషయానికి… వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం మన అందరికి తెలిసిందే. ఖాళీ సమయం దొరికితే చాలు వీరిద్దరూ విదేశీ యాత్రలకు కూడా కలిసి వెళుతుంటారు. తమన్నాతో తన స్నేహం గురించి శృతి తమిళ మీడియాతో మాట్లాడింది. `నేనే కనుక అబ్బాయిగా పుట్టి ఉంటే.. కచ్చితంగా తమన్నానే పెళ్లి చేసుకుని ఉండేదాన్ని. అంత మంచి అమ్మాయిని ఎవరు వదులుకుంటారు` అని శృతి చెప్పింది. శృతి కామెంట్ గురించి తాజాగా తమన్నా స్పందించింది. `శృతి నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆమె నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాట నిజమే. శృతి కామెంట్ మైకేల్ వరకు వెళ్లిందట. దాంతో అతను వెంటనే శృతికి ఫోన్ చేసి `ఏంటి నువ్వు తమన్నాను పెళ్లి చేసుకుంటున్నావా` అని అడిగాడట.