టాలీవుడ్ లో నటనతో సౌత్ ఆడియన్స్ ను తనవైపు తిప్పుకున్న సుందరి సాయిపల్లవి. తనకు దక్కిన 2 కోట్ల ఆఫర్‌ని వదులుకుంది. ఎలాంటి మేకప్‌లకు ప్రాధాన్యం ఇవ్వకుండా నాచురల్‌గా కనిపిస్తూనే నాచురల్ నటన కనబర్చడమనేది ఆమెకే సొంతం అన విషయం మన అందరికి తెలిసిందే. కాగా పలువురు సెలబ్రిటీలు.సినిమాలు చేస్తూనే పలు ప్రకటనల ద్వారా సొమ్ము సంపాదిస్తారు. ఈ రోజుల్లో తాను మాత్రం ఎలాంటి ప్రకటనల్లో నటించనని గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న ఈమె అన్నంత పని చేసింది. తాజాగా ఆమెకు ఓ ప్రముఖ ఉత్పత్తుల సంస్థ వారు తమ పేస్ క్రీమ్ ప్రకటనలో నటిస్తే 2 కోట్లు ఇస్తామని భారీ ఆఫర్ ఇచ్చారు. కానీ అందుకు ఆమె తిరస్కరించడమే గాక ఎలాంటి మేకప్ లేకుండా సినిమాల్లో నటిస్తున్న తాను మీ ఉత్పత్తులను ఎలా ప్రమోట్ చేస్తానని ప్రశ్నించిందట. పోనీ మేకప్ లేకుండానే మా ప్రకటనలో కనిపించండి అని సదరు సంస్థ సూచించినప్పటికీ నో అని చెప్పేసిందట సాయి పల్లవి. మొత్తానికి ఈ రకంగా ఆమె ప్రత్యేకం అని నిరూపించుకుంది.