పెళ్లి తర్వాత కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, నాజూకైన రూపాన్ని, శారీరక దారుఢ్యాన్ని కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. అలాంటివారిలో సమంత అక్కినేని ఒకరు. నాగచైతన్యతో పెళ్లికి ముందు అగ్రహీరోలందరితో నటించిన సమంత ప్రస్తుతం హీరోయిన్ గా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తోంది. అందుకు అనుగుణంగా ఆమె తనను తాను మలుచుకుంటున్న తీరు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫిట్ నెస్ కు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చే సమంత తాజాగా 100 కిలోల బరువును సునాయాసంగా ఎత్తి ఔరా అనిపించింది. తన జిమ్ వర్కౌట్ లో భాగంగా సమంత అంత బరువును ఎత్తుతూ వ్యాయామం చేయడం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
previous article
షూటింగుకి సిద్ధమవుతోన్న ఎన్టీఆర్ – చరణ్
next article
హిట్ ఇవ్వకున్నా నాకు మర్యాద ఇచ్చిన ఒకే ఒక హీరో…
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment