ఇంట‌ర్ కూడా పూర్తి చేయ‌ని సచిన్‌…?

తెలంగాణ‌లో విడుద‌లైన ఇంట‌ర్ ఫ‌లితాల‌లో ఉత్తీర్ణ‌త సాధించ‌లేక‌పోయామ‌నే కార‌ణంతో దాదాపు 16 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన సంగ‌తి మన అందరికి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల త‌ల్లిదండ్రులు ఒక్క‌సారిగా ఉలికిపాటుకు గుర‌య్యారు. సినీ ప్ర‌ముఖులు సైతం విద్యార్థుల్లో ధైర్యం నూరిపోసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. యంగ్ హీరో రామ్ పోతినేని ఇప్ప‌టికే ఇంట‌ర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల గురించి ట్విట‌ర్‌లో స్పందించిన సంగ‌తి తెలిసిందే. అదే విషయంపై తాజాగా మ‌రో ట్వీట్ చేశాడు. ఈ రోజు (బుధ‌వారం) జ‌న్మ‌దినోత్సవం జ‌రుపుకుంటున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూడా ఇంట‌ర్ పాస్ అవ‌లేద‌నే విష‌యాన్ని రామ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ‘‘పార్క్‌లో కూర్చుని బిస్కెట్లు తినే పిల్ల‌ల‌కి ఎలా చెప్పినా వింటారు. బెడ్రూమ్ లాక్ వేసుకుని లైఫ్ ఎలా అనుకునే పిల్ల‌ల‌కు నిజాలు ఇలా చెబితేనే వింటారు… ఇంట‌ర్ కూడా పూర్తి చేయని.. జాతి గ‌ర్వించే ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్‌గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు’’ అని టాలీవుడ్ యాంగ్ హీరో రామ్ ట్వీట్ చేశాడు.Image result for ram hero

Leave a Response