టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తదుపరి సినిమాల గురించి ప్రకటించారు. `కమ్మరాజ్యంలో కడపరెడ్లు` అనే పేరుతో వర్మ సినిమాను అభిమానుల ముందుకు తెస్తున్నాడు .ఈ విషయాని విజయవాడలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వర్మ చెప్పాడు. కథ గురించి ఆయన మాట్లాడుతూ తాను ఇంకా కథ రాసుకోలేదని.. ఇకపై రాయాల్సి ఉందన్నారు. ఈయన దర్శకత్వం వహించిన గత చిత్రం `లక్ష్మీస్ ఎన్టీఆర్` ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సినిమా గురించి ఏపీలో ఎంతో ఆశక్తి గా ఎదురు చూస్తున్నారు.