తిరిగి షూట్ చేస్తన్న ప్రభాస్…?

సంచలం సృష్టించిన హీరో మన ప్రభాస్. బాహుబలి సినిమా తరువాత డార్లింగ్ నటిస్తున్న సినిమా ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో .. భారీ బడ్జెట్ లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తుంది, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగుకి బ్రేక్ ఇచ్చారు. ఈ సమయంలో ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ రూపొందిస్తోన్న సినిమా షూటింగులో ప్రభాస్ పాల్గొన్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా పూజా హెగ్డే నటిస్తోంది.మళ్లీ ఇప్పుడు ‘సాహో’ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ముంబైలో మొదలైన ఈ షూటింగులో ప్రభాస్ జాయిన్ అయ్యాడు. ప్రభాస్ .. తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. Image result for prabhas

Leave a Response