మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ‘మహర్షి’ సినిమా అభిమానుల ముందుకు వస్తుంది. వచ్చేనెల 9వ తేదీన భారీస్థాయిలో తెరకెక్కనుంది. ఈ లోగా .. అంటే మే 1వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా ఇందుకు వేదికగా మారనుంది.ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది. ఎన్టీఆర్ గానీ చరణ్ గాని ముఖ్య అతిథిగా రావొచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ .. చరణ్ ఇద్దరూ కూడా మహేశ్ బాబుకి మంచి స్నేహితులు కావడం వలన, ఇద్దరూ వచ్చే అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకుంటున్నారు.