సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో అభిమానుల ముందుకు వచ్చిన సినిమా ‘చిత్రలహరి’. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ లవ్ స్టోరీకి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ వేదికపై సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ, “వరుస పరాజయాల తరువాత ఈ విజయం దక్కింది. దర్శకుడితో కలిసి నేను .. సునీల్ .. హైపర్ ఆది స్క్రిప్ట్ విషయంలో కసరత్తు చేశాము. రెస్పాన్స్ ను చూస్తుంటే మా ప్రయత్నం ఫలించిందని అనిపిస్తోంది. అన్ని ప్రాంతాల నుంచి హిట్ టాక్ వస్తుండటం ఆనందంగా వుంది .. ఈ విజయం నా ఒక్కడిదే కాదు .. అందరిది” అని అన్నాడు. “ఈ సినిమాలో పోసాని పోషించిన నా తండ్రి పాత్ర నాకెంతో ఇష్టం. ఈ పాత్ర అనుక్షణం నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ వుంటుంది.
previous article
అల్లుఅర్జున్ సినిమాలో మళయాళ నటుడు…?
next article
రామజీ రావు గ్రాండ్ డాటర్ వెడ్డింగ్‌లో CM KCR