ఈ ఏడాది మెహరీన్ ఎఫ్2 వంటి మంచి హిట్ దక్కినా అవకాశాలు పెద్దగా రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా మెహరీన్ రెండు సినిమాలకు సైన్ చేసింది. అందులో ఒకటి పంజాబీ సినిమా కాగా.. మరోటి గోపీచంద్, తిరు సినిమా. తాజాగా నాగశౌర్య సినిమాలో కూడా మెహరీన్ నటించనుందట.తేజ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించబోయే ఈ సినిమా నాగశౌర్య స్వంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో తెరకెక్కనుందట.