టాలీవుడ్ లో వరుస విజయవంతమైన చిత్రాలను డైరెక్ట్ చేసి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నాడు కొరటాల శివ. ఈ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. అది కూడా ఏకంగా సూపర్‌స్టార్ మహేష్ సినిమాకు కావడం విశేషం. సినీ వర్గాల్లో వినపడుతున్న సమాచారం ప్రకారం మహేష్, పరుశురాం కాంబినేషన్‌లో ఓ రూపొందనుంది. ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాను నిర్మించడానికి దర్శకుడు కొరటాల శివ ఆసక్తిగా ఉన్నారట. కొరటాల తన స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించే అవకాశాలున్నాయని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా న్యూస్ వినపడుతుంది. మరి మహేష్ ఎవరి వైపుకు మొగ్గు చూపుతారో తెలియాలంటే వెయిటింగ్ తప్పదు.
previous article
బిగ్ బాస్ 3 లో యూట్యూబ్ జంట…
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment