ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సినిమా మహర్షి. ఈ సినిమా రిలీజ్ కన్న ముందే సినిమా పై అందరిలో ఆశక్తి రేపుతోంది. ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం సెకండ్ లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు ఈ సినిమా దర్శకుడు. “నువ్వే సమస్తం .. నువ్వే సిద్ధాంతం .. నువ్వే నీ పంతం .. నువ్వేలే అనంతం .. ప్రతి నిశి మసై .. నీలో కసై దిసై అడుగేసేయ్ మిస్సేయిలులా .. ” అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. శ్రీమణి సాహిత్యం ఆకట్టుకునేలా ఉన్నాయి అన్ని టాలీవుడ్ టాక్. ఈ సాంగ్ యూత్ ను .. మహేశ్ బాబు ఫ్యాన్స్ ను పట్టేసేదిలా వుంది. దిల్ రాజు .. అశ్వనీదత్ .. పీవీఆర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ తో అభిమానుల ముందుకు వస్తున్నాడు.