టాలీవుడ్ మిల్క్ బాయ్ మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లో అభిమానుల ముందుకు వచ్చిన సినిమా ‘మహర్షి’, ఈ నెల 9వ తేదీన విడుదలైంది. అందాల సుందరి పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా, వసూళ్ల పరంగా దూకుడును కొనసాగిస్తూనే వుంది. ప్రపంచవ్యాప్తంగా 19 రోజుల్లో ఈ సినిమా 164 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.
వసూళ్లపరంగా ఇప్పటివరకూ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా పేరుతో వున్న రికార్డును ‘మహర్షి’ అధిగమించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వంశీ పైడిపల్లి కథాకథనాలు .. డిఫరెంట్ లుక్స్ తో మహేశ్ బాబు నటన .. పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచిన కారణంగానే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మహేశ్ బాబు 26వ సినిమా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనుంది. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు