టాలీవుడ్ జూనియర్ హీరో సుధాకర్ కొమాకుల హీరోగా బేబి జాహ్నవి సమర్పణలో తెరకెక్కిన సినిమా ‘నువ్వు తోపురా’. నిత్యాశెట్టి కథానాయిక. బి దర్శకత్వంలో డి.శ్రీకాంత్ నిర్మించారు ఈ సినిమా. గీతా ఫిలిం డిస్ర్టిబ్యూటర్స్ ద్వారా మే 3న అభిమానుల ముందుకిరానుందీ సినిమా. ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం ప్రభాస్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘ట్రైలర్ బావుంది. సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుందని భావిస్తున్నాను’’ అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌కు చెందిన సూరి అనే యువకుడి కథ ఇది. ఎలాంటి బాధ్యతలు లేకుండా తిరిగే అతను ఎలా మారాడు? అమెరికా ఎందుకు వెళ్లాడు? అన్నది ఆసక్తికరంగా తెరకెక్కించాం. సినిమా విడుదలకు సహకరిస్తున్న అల్లు అరవింద్‌గారికి, బన్నీ వాస్‌కి థ్యాంక్స్’’ అని అన్నారు.
previous article
ఇంటర్ కూడా పూర్తి చేయని సచిన్…?
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment