రాహుల్ రవీంద్రన్ నాగార్జున కాంబినేషన్లో ‘మన్మథుడు 2’ రూపొందుతోంది. ఈ సినిమాలో రకుల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో, సమంత ప్రత్యేక పాత్రలో కనిపించనుందట. ఈ సినిమా పోర్చుగల్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్నపూర్ణ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాను ఈ ఆగస్టు చివరిలో విడుదల చేయాలని నాగార్జున ఆలోచిస్తున్నారంట.
ఇంతలోనే నాని కథానాయకుడిగా నటిస్తోన్న ‘గ్యాంగ్ లీడర్’ ఆగస్టు 30వ తేదీన విడుదలని పోస్టర్ రిలీజ్ చేసారు. ఆగస్టు చివరిలో విడుదల చేయాలని నాగార్జున ఆలోచనలో పడ్డారట. ఈ మధ్య కాలంలో నాగార్జునకి సక్సెస్ లేదు. కనుక సోలో రిలీజ్ ఆయనకి చాలా అవసరమని ఆయన ఉద్దేశం. ఆ విషయాన్ని గ్రహించి, నాని సినిమాకి .. తన సినిమాకి వారం రోజుల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు టాలీవుడ్ వర్గాలు.