100 కోట్లకి అడుగుపెట్టిన ‘కాంచన 3’..?

టాలీవుడ్ సీనియర్ హీరో మన లారెన్స్ . ప్రస్తుతం అయన కాంచన 3 సినిమా సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమాకి ఆయన దర్శకత్వంలోనే ‘కాంచన 3’ రూపొందిందన విషయం మన అందరికి తెలిసిందే . తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 19వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 2600 థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు దర్శకుడు. రెండు భాషల్లోను తొలిరోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. బి – సి సెంటర్స్ లో భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. తొలివారం రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేయడం విశేషం. ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధించడంతో, ‘కాంచన 4’కి లారెన్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు.Image result for kanchana3

Leave a Response