టాలీవుడ్ దర్శకుడు తేజ, యాంగ్ హీరో బెల్లంకొండా శ్రీనివాస్ కాంభినేషన్ లో ‘సీత’ సినిమా రూపొందింది. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. రేపు ఈ సినిమా థియేటర్లకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్ బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “తేజ రెండు కథలతో మమ్మల్ని కలిశారు. మా నాన్నకి నాకు కలిపి రెండు కథలను వినిపించారు. నాకు ‘సీత’ కథ నచ్చింది .. మా నాన్నకు మాత్రం మరో కథ నచ్చింది .. అది యాక్షన్ ఎంటర్టైనర్. ఆ సినిమానే చేయమని నాన్న అన్నాడు. నేను ఎప్పుడూ మా నాన్న ఓకే చెప్పిన సినిమానే చేస్తాను. ఈ సారి మాత్రం నాకు ‘సీత’ కథ నచ్చిందని చెప్పి, ఆయన అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ సినిమా చేశాను. అందుకే ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను” అన్ని చెప్పారు.
previous article
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పవన్….
next article
సంబరాల్లో వైకాపా.. జగన్కు అభినందనల వెల్లువ
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment