17న వస్తున్న మిస్టర్‌.లోకల్‌

రాజేష్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్‌, నయనతార జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్‌.లోకల్‌’. ఈ సినిమా ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. హాస్యానికి పెద్దపీట వేసే రాజేష్‌, నవ్వుల జల్లులకు ఏమాత్రం కొదవ లేకుండా ఈ సినిమాను రూపొందించినట్లు సమాచారం. లోకల్‌ కుర్రాడు, ఓ ధనవంతురాలైన కథానాయిక మధ్య జరిగే వినోదాత్మక కథే ఈ సినిమా అని చెబుతున్నారు. నయనతార చిటికెలేస్తూ శివకార్తికేయన్‌ను పిలవడం, గ్రామీణ పొలాల మధ్య, చీరకట్టుతో నయనతార కనిపించడం ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. కొన్ని సన్నివేశాలు రజనీకాంత్‌ నటించిన ‘మన్నన్‌’లో విజయశాంతిని తలపిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంలో యోగిబాబు, రోబోశంర్‌, సతీష్‌ తదితరులు నటించారు. ఈ నెల 17న చిత్రాన్ని తెరపైకి తీసుకురానున్నారు. స్టూడియోగ్రీన్‌ బ్యానరుపై జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Leave a Response