లారెన్స్ కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కాంచన 3’ భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ అక్కడి మాస్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ విజయం పట్ల లారెన్స్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘కాంచన 4’ కూడా తప్పకుండా ఉంటుందనీ, ఆ కథపై కసరత్తును మొదలుపెడతానని ఆయన అన్నాడు.
‘కాంచన 4’ సినిమాను నిర్మించడానికి సన్ పిక్చర్స్ వారు ముందుకు వచ్చారనేది తాజా సమాచారం. 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడానికి వాళ్లు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఈ సినిమాను ‘3డీ’లో చేయాలనీ .. భారీస్థాయిలో గ్రాఫిక్స్ ను ఉపయోగించాలని .. భారీ తారగణాన్ని తీసుకోవాలని అనుకోవడం వలన, ఈ సినిమాకి ఈ స్థాయి ఖర్చు అవుతుందని అంటున్నారు. హారర్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాపైనే లారెన్స్ అభిమానులు ప్రత్యేక దృష్టి పెట్టారు.