తన అపోలో కుటుంబాన్ని సిబ్బందిని ఉద్దేశిస్తూ చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని అంటున్నారు అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసన. భారతదేశంలో అత్యుత్తమ ఆక్కుపేషనల్ హెల్త్ సెంటర్లలో అపోలో లైఫ్ స్టూడియో స్థానం సంపాదించుకుంది. అంతేకాదు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌గా అపోలో సంస్థ మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఉపాసన అపోలో సిబ్బంది దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ‘కంపెనీ సంతోషంగా ఉంటే.. ఆరోగ్యంగానూ ఉంటుంది. నా కుటుంబం సంతోషంగా ఉందని చెప్పడానికి నేనెంతో గర్వపడుతున్నాను. దృఢమైన విలువలు, పాజిటివిటీ, నూతన ఆవిష్కరణలు, తాతగారి ఆశీర్వాదాలే మా బలం’ అని పేర్కొన్నారు. అపోలో సంస్థలను ఉపాసన తాతగారు డాక్టర్ సి. ప్రతాప్‌రెడ్డి 1983 స్థాపించారు. ఈ సంస్థకు భారత్‌లో తొలి కార్పొరేట్ హెల్త్ కేర్ సెంటర్‌గా పేరుంది.
previous article
15 రోజులు.. రెండు కోట్లు..?
next article
వదంతులపై ఫైర్ అయిన రాయ్‌లక్ష్మీ
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment