వరుణ్‌తేజ్ కథానాయకుడిగా హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో విజయవంతమైన ‘జిగర్తాండ’కి రీమేక్‌గా రూపొందుతోంది. ఇందులో వరుణ్‌తేజ్‌తోపాటు తమిళ కథా నాయకుడు అథర్వ కీలక పాత్ర పోషిస్తున్నారు. కథానాయికగా పూజా హెగ్డే ఎంపికైంది. ఓ కొత్త కథానాయికని ఎంపిక చేసుకోవాలనుకొన్న చిత్రబృందం, చివరికి పూజ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. పూజా హెగ్డే త్వరలోనే ‘మహర్షి’ చిత్రంతో సందడి చేయబోతోంది. మరోపక్క అల్లు అర్జున్, ప్రభాస్ వంటి అగ్ర కథానాయకులతో కలిసి నటిస్తోంది. జోరు మీదున్న పూజ త్వరలోనే ‘వాల్మీకి’ కోసం రంగంలోకి దిగనున్నట్టు సమాచారం. ఇందులో వరుణ్‌తేజ్ వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్రలో సందడి చేయనున్నట్టు సమాచారం. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.
previous article
‘మా చిత్ర పరిశ్రమను వదిలేయండి మోదీ’
next article
ఆ వ్యక్తి వృద్ధుడైతేనే.. యువకుడైతేనేమి: రకుల్
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment