రానాతో చేయడానికి డేట్స్ కుదరలేదన్న నిఖిల్…

టాలీవుడ్ జూనియర్ హీరో నిఖిల్ నటిస్తున్న సినిమా ‘అర్జున్ సురవరం’ ఈ రోజున థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా టాక్ ఎలా వుండనుందనే విషయంలో నిఖిల్ ఆసక్తిగా వున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ ..”ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. కుటుంబ సమేతంగా చూసే సినిమాలు చేయకపోతే ఇంట్లోకి రానివ్వనని మా అమ్మ చెప్పడంతో, అప్పటి నుంచి ఫ్యామిలీ ఎమోషన్స్ నా సినిమాల్లో ఉండేలా చూసుకుంటున్నాను. ఇక ఈ మధ్య కాలంలో నాకు బాధ కలిగించిన సంఘటన ఒకటి జరిగింది. హిందీ సినిమా ‘హాథీ మేరీ సాథీ’లో ఒక ముఖ్యమైన పాత్ర ఉందని చెప్పి, నన్ను చేయమని రానా అడిగాడు. రానాతో నాకు ఎంతో సాన్నిహిత్యం వుంది. అలాగే జంతువుల నేపథ్యంలో సాగే కథలన్నా నాకు చాలా ఇష్టం. అయినా డేట్స్ కుదరని కారణంగా ఆ సినిమా చేయలేకపోయాను. ఆ అవకాశాన్ని వదులుకున్నందుకు ఇప్పటికీ బాధగానే వుంది” అని అయన చెప్పిన మాటలు టాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి.

Image result for nikhil

Leave a Response