టాలీవుడ్ లో ఈ మధ్య బయోపిక్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక విషయంలోకి వస్తే… ఈ రోజు విడుదలకావల్సిన నరేంద్ర మోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్రమోదీ’ వాయిదా పడిందట. ఈ బయోపిక్ విడుదలను వాయిదా వేస్తున్నట్టు నిర్మాత సందీప్ సింగ్ తన ట్విట్టర్ ద్వారా తెలుగు అభిమానులనుకు తెలిపారు. ఎన్నికల సమయంలో ఈ సినిమా విడుదలైతే ఓటరుపై ప్రభావం చూపే అవకాశం ఉందని, కాబట్టి ఆ సినిమా విడుదలను వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత ఒకరు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు సోమవారం నుంచి వాదనలు వింటున్నామని తెలిపారు. ‘పీఎం నరేంద్రమోదీ’ ఈ సినిమాని ఈ నెల 5న విడుదల చేయాలని భావించామని, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్టు దర్శకుడు సందీప్ సింగ్ తమ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు.
previous article
రేపు గుడ్ మార్నింగ్ చెపుతున్న మహర్షి…?
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment