మూడో చిత్రానికి సిద్ధం

కథానాయకుల్లో రవితేజ జోరు వేరు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో సందడి చేసిన ఘనత ఆయనది. వరుసగా వచ్చే రవితేజ సినిమాలతో బాక్సాఫీసు కళకళలాడుతుంటుంది. మధ్యలో ఆయన వేగం తగ్గినా, గతేడాది ఆయన్నుంచి మూడు చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ చిత్రం చేస్తున్నారు. తదుపరి గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపినట్టు సమాచారం. రవితేజ – గోపీచంద్‌ మలినేని కలయికలో ఇదివరకు ‘డాన్‌ శీను’, ‘బలుపు చిత్రాలు తెరకెక్కాయి. ముచ్చటగా మూడోసారి ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయడానికి రంగం సిద్ధమైంది. త్వరలోనే చిత్రం ప్రారంభం  కానున్నట్టు సమాచారం. ప్రస్తుతం తుది దశ పూర్వ నిర్మాణ పనులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

Leave a Response