సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘మహర్షి’ సినిమాలో ఓ కొత్త పాటను చేర్చారు. ‘ఫిర్ సే..’ అనే పాటను సినిమాలో యాడ్ చేసినట్లు చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ నేడు ప్రకటించింది. పోస్టర్లో మహేశ్ స్టైల్‌గా కూర్చుని చాయ్ తాగుతూ కనిపించారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేయనున్నారు. సాయంత్రమే ‘మహర్షి’ జ్యూక్ బాక్స్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మే 9న ‘మహర్షి’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
previous article
100 కోట్ల బడ్జెట్ తో ‘కాంచన 4’
next article
కేసీఆర్ కుటుంబ సభ్యులపై అభ్యంతరకర పోస్టులు
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment