మర్యాద లేని చోట నేనుండను….

‘కాంచన’కు  హిందీ రీమేక్‌. ‘లక్ష్మీబాంబ్‌’కు రాఘవ లారెన్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు   ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌, కియారా అడ్వాణీ జంటగా నటిస్తున్నారు  అయితే ఈ సినిమా నుంచి తాను తప్పుకొన్నట్లు రాఘవ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు అని తమిళంలో ఓ సామెత ఉంది  ఈ ప్రపంచంలో డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం. నాకు ఆత్మాభిమానం ఉంది కాబట్టే ‘లక్ష్మీబాంబ్‌’ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. నేను కారణం చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఒకటి’ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు  నాకు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ డిజైన్‌ కూడా నచ్చలేదు ‘నా అనుమతి లేకుండా నాతో చర్చించకుండా పోస్టర్‌ను విడుదల చేసేశారు  ఓ దర్శకుడిగా ఇది ఎంత బాధాకరంగా ఉంటుందో నాకు తెలుసు  ఇక ఈ సినిమాకు దర్శకుడిగా కొనసాగలేను  చిత్రబృందానికి  నచ్చిన దర్శకుడిని ఎంచుకోవచ్చు 

Leave a Response