వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో `డిస్కోరాజా` సినిమాతో రవి తేజ అభిమానుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. మే 27 నుండి రెండో షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమా పూర్తి కాకముందే రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వినపడుతున్నవార్తల ప్రకారం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ సినిమా చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇది వరకు డాన్ శీను, బలుపు చిత్రాలు వచ్చాయి. రెండు సినిమాల చాలా పెద్ద హిట్ అయ్యాయి.