సార్వత్రిక ఎన్నికల ఫలితాల తాకిడి భారత్‌లోనే కాదు దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ ఉంది. ఈ రోజు ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో పాక్‌లో లైవ్ ప్రసారం చేయనున్నట్లు భారత హై కమిషన్ ప్రకటించింది. ‘ప్రజాస్వామ్య పండుగ. గురువారం భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలను లైవ్‌లో వీక్షించండి. మధ్యాహ్నం 12 గంటలకు భారత హై కమిషన్ ఆడిటోరియంలో ప్రసారం చేయబోతున్నాం’ అని పేర్కొంది.అంతేకాదు అమెరికాలోని భారత ఎన్నికల ఫలితాలను లైవ్ ప్రసారం చేయనున్నారు. . రమేశ్ నూనే అనే ఐటీ ఉద్యోగి ఈ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని కూడా. మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నియాపాలిస్ నగరంలో ఓ థియేటర్‌లో ఎన్నికల ఫలితాలను ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. ఆసక్తిగల వారు ఈ థియేటర్‌కు వచ్చి వివిధ ఛానెళ్లు ప్రసారం చేసే ఎన్నికల ఫలితాలను కూర్చుని వీక్షించవచ్చు.భారతీయ కాలమానం ప్రకారం గురువారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఫలితాల ‘షో’ థియేటర్‌లో ప్రసారం అవుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు 150 మంది ప్రవాస భారతీయులు 15 డాలర్ల విలువైన టికెట్లు కొనుగోలు చేశారట. ఓఎఫ్‌బీజేపీ (ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ) వర్గాలు అమెరికాలోని టెక్సాస్, వాషింగ్టన్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా ప్రాంతాల్లో ఎన్నికల ఫలితాలు ప్రసారమయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
previous article
చంద్రబాబు రాజీనామా
next article
తమిళ్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన రష్మిక …
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment