అసలైన హీరో మోదీకి సినీ ప్రముఖుల సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి కూడా మోదీనే విజయం సాధించారు. దాంతో కమలనాథులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.1. డియర్ మోదీజీ.. హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు సాధించారు – రజనీకాంత్ 2. మనమంతా ఓటేశాం. ప్రజాస్వామ్యం సమాధానం చెప్పింది. ఇది ప్రజా తీర్పు. మోదీజీకి కంగ్రాట్స్. మీ నాయకత్వంలో భారత్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం- హుమా ఖురేషీ 3.కంగ్రాట్స్ మోదీ సర్. మీ నేతృత్వం, నాయకత్వంలో భారతీయులు కలిసికట్టుగా ముందుకు సాగుతారు- వరుణ్ ధావన్ 4.ఏది సరైనదో ఈ దేశానికి బాగా తెలుసు. అందుకే వారి నిర్ణయం వారు తీసుకున్నారు- అజయ్ దేవగణ్ 5.కంగ్రాట్స్ మోదీజీ. మీరు మమ్మల్ని మరింత ఉన్నత స్థానాలకు తీసుకువెళతారని ఆశిస్తున్నాం. ఈ దేశ పౌరుడిగా నా అభిప్రాయాలను నిర్మొహమాటంగా, నిజాయతీగా వెల్లడిస్తానని హామీ ఇస్తున్నాను. ప్రేమను పంచండి. జై హింద్- సిద్ధార్థ్ 6.ప్రజాస్వామ్యం తన తీర్పును ఇచ్చేసింది. ప్రధాని నరేంద్రమోదీజీకి, భాజపా, ఎన్డీయేకు శుభాకాంక్షలు. మున్ముందు దేశం మరింత అభివృద్ధికి నోచుకుంటుందని, ప్రశాంతత, ఐకమత్యం నెలకొంటాయని ఆశిస్తున్నాను- కాజల్ అగర్వాల్ 7.మోదీ వచ్చేశారు. మరో ఐదేళ్లు మీ పాలనే – మంచు లక్ష్మి 8.నవ భారత్‌కు శుభాకాంక్షలు. ఇది మోదీజీకి చరిత్రాత్మక విజయం. ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది. భారతదేశ అసలైన హీరో మోదీ మనకు ప్రధానిగా ఉన్నందుకు గర్వంగా ఉంది- వివేక్ ఒబెరాయ్
previous article
అన్నపూర్ణ స్టూడియోలో ప్రభాస్…
next article
తమిళ్ హీరోగా నటిస్తున్న టాలీవుడ్ హీరో…
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment