పవన్‌ కల్యాణ్‌ న్యూలుక్‌……

జనసేనకు 2019 ఎన్నికల్లో తీవ్ర నిరాశ మిగిలింది. పవన్‌ పోటీచేసిన రెండు చోట్లా ఓడిపోయారు. భీమవరంలో వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ చేతిలో పవన్‌ సుమారు 2 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోవైపు గాజువాకలోనూ వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో పవన్‌ ఓడిపోయారు. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన ఆ పార్టీకి కేవలం ఒక్క సీటు దక్కింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కొత్త ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన గత కొన్ని రోజుల క్రితం వరకు రాజకీయ నాయకుడిగా తెల్లటి లాల్చీ పైజమాలో కనిపించారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపారు. ఫలితాలు వెలువడిన తర్వాత పవన్‌ తొలిసారి రంగు దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఆయన నీలి రంగు టీ షర్ట్‌, జీన్స్‌ ధరించి ఉన్న ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. చాలా రోజుల తర్వాత పవర్‌స్టార్‌ను అలా చూడటంతో అభిమానులు ఫొటోలను తెగ షేర్‌ చేస్తున్నారు. అయితే ఆయన గడ్డాన్ని మాత్రం తీయకుండా అలానే ఉంచారు.

Leave a Response