పదరా పదరా పదరా.. నీ అడుగుకి పదును పెట్టి పదరా. ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా’ అంటూ రైతులతో కలిసి అడుగులు వేశారు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు. ఆయన నటించిన సినిమా ‘మహర్షి’లోని నాలుగో పాటను బుధవారం విడుదల చేయబోతున్నారు. ‘పదరా పదరా..’ అని సాగే ఈ పాటను ఏప్రిల్ 24న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ దర్శకుడు వంశీ పైడిపల్లి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలోనూ మహేశ్ రైతులకు అండగా ఉండబోతున్నట్లు పోస్టర్ చూస్తే తెలిసింది.
‘మహర్షి’ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక పాత్ర పోషించారు. నరేష్, మీనాక్షి దీక్షిత్, సోనాల్ చౌహాన్, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్‌రాజ్, పోసాని, రావు రమేశ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. దిల్‌రాజు, అశ్వినీ దత్, ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.