నవంబర్‌లో నయన్‌ నిశ్చితార్థం?

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార, ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తమ ప్రేమ విషయంలో ఈ జంట మరో అడుగు ముందుకు వేయాలనుకుంటోంది. ఈ ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకోవాలని నయన్‌, విఘ్నేశ్‌ నిర్ణయించుకున్నారట. ఈ మేరకు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదీకాకుండా నయన్‌ వేలికి ఓ ఉంగరం తొడిగి ఉందట. దాంతో నయన్‌, విఘ్నేశ్‌ ఇదివరకే ఉంగరాలు మార్చుకున్నట్లు కూడా వార్తలు వెలువడుతున్నాయి. అయితే అందరి సమక్షంలో ఓ నిశ్చితార్థ వేడుక నిర్వహించాలని ఇరు వైపు కుటుంబాలు యోచిస్తున్నాయట.
అన్నీ అనుకున్నట్లు జరిగితే 2020లో నయన్, విఘ్నేశ్‌ ఓ ఇంటివారు అవుతారు. 2015లో ‘నానుమ్‌ రౌడీదాన్’ అనే చిత్రం ద్వారా నయన్‌, విఘ్నేశ్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. ఈ సినిమాకు విఘ్నేశ్‌ దర్శకత్వం వహించగా.. నయన్‌ కథానాయికగా నటించారు. ఆ పరిచయం కాస్తా స్నేహానికి దారి తీసి ప్రేమగా మారింది. అప్పటినుంచి నయన్‌, విఘ్నేశ్‌ జంటగా విహారయాత్రలకు వెళుతున్నారు. అక్కడి ఫొటోలను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్నారు.
ప్రస్తుతం నయన్‌ చేతిలో ‘సైరా నరసింహారెడ్డి’, ‘మిస్టర్‌ లోకల్‌’, ‘దర్బార్’ సినిమాలు ఉన్నాయి. మరోపక్క విఘ్నేశ్‌.. శివ కార్తికేయన్‌తో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు.

Leave a Response