దీని వెనుక ఎవరున్నారో తెలుసు : ఆర్జీవీ

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విడుదలను అడ్డుకోవటంపై స్పందించారు. ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా ఆంధ్రప్రదేశ్‌ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఆంక్షల కారణంగా వాయిదా పడిన ఈ సినిమాను పోలింగ్ పూర్తి కావటంతో మే 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేశారు. గతంలో కోర్టు.. పోలింగ్‌ తరువాత విడుదల చేయవచ్చని ఉత్తర్వులు ఇవ్వటంతో రిలీజ్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తాజాగా ఎలక్షన్ కమీషన్‌  లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రిలీజ్‌కు మరోసారి బ్రేక్‌ వేసింది. అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలపటంపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కోర్టు తీర్పుతో పాటు ఇచ్చిన ఈసీ లేకను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వర్మ, న్యాయపోరాటనికి సిద్ధమవుతున్నట్టుగా తెలిపారు. అంతేకాదు సినిమా విడుదలను అడ్డుకుంటున్న ఆ అజ్ఞాత శక్తులెవరో అందరికీ తెలుసంటూ ట్వీట్ చేశారు.

Leave a Response