త్రిష.. మనం పెళ్లి చేసుకుందామా?

ఏళ్లు గడుస్తున్నా.. తన సహనటి త్రిషపై నటి ఛార్మికి ఉన్న ప్రేమ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఛార్మి ఇప్పటికే పలుమార్లు త్రిషకు సరదాగా ప్రపోజ్‌ చేశారు. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని ప్రశ్నించారు. దీనికి త్రిష గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చారు. 2015, 2017లోనూ ఛార్మి ఇదే విధంగా ట్వీట్‌ చేశారు. కాగా శనివారం త్రిష 36వ పుట్టినరోజు సందర్భంగా ఛార్మి ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ‘బేబీ ఐ లవ్‌ యు టుడే, ఫరెవర్‌. నా మోకాలిపై కూర్చుని నీ సమ్మతి కోసం ఎదురుచూస్తున్నా. మనం పెళ్లి చేసుకుందామా’ అంటూ ‘హ్యాపీ బర్త్‌డే’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. దీంతోపాటు త్రిష తనను ముద్దుపెట్టుకుంటున్న ఫొటోను షేర్‌ చేశారు. దీనికి త్రిష ప్రతిస్పందిస్తూ.. ‘ధన్యవాదాలు.. నేను నీకు ఎప్పుడో ఓకే చెప్పా’ అని ట్వీట్‌ చేశారు.
ఛార్మి గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్నారు. ఆమె చివరిసారి వెండితెరపై 2015లో ‘మంత్ర 2’, ‘జ్యోతిలక్ష్మి’ సినిమాలలో కనిపించారు. తర్వాత నిర్మాతగా మారారు. ‘రోగ్‌’, ‘పైసా వసూల్‌’, ‘మెహబూబా’ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘రొమాంటిక్‌’ చిత్రాల కోసం పనిచేస్తున్నారు.

Leave a Response