తెలుగు సినిమా ఇండస్ట్రీలో N.T.రామారావు తరువాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి.మెగాస్టార్ చిరంజీవి నటించిన కొన్ని చిత్రాలు చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1,116 రూపాయలు. మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించాడు. ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా నిలద్రొక్కుకున్నాడు. ఇంకా చంటబ్బాయ్,ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలలో వివిధ తరహా పాత్రలలో మెప్పించి మంచి గుర్తింపు పొందగా, గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలమయిన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1980, 90లలో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, స్వయంకృషి, రుద్రవీణ, ఆపద్భాందవుడు వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాలు కూడా చేశాడు.తరువాత కొంతకాలం చిరంజీవి సినిమాలు అంతగా విజయవంతంగా నడువ లేదు. 2007-2008 సంవత్సరాలలో చిరంజీవి రాజకీయాలలోకి రావాలని రాష్ట్రమంతటా ప్రదర్శనలు జరిగాయి. పోస్టర్లు వెలిశాయి. మళ్ళీ 1990 దశకం చివరిలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని వుంది సినిమాలు మంచి విజయాలను సాధించాయి. 2002లో వచ్చిన ఇంద్ర, ఠాగూర్ సినిమాలు తారా పధంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకు వెళ్ళింది. ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి. తరువాత వచ్చిన శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ వంటి సినిమాలు విజయవంతాలైనా గాని సినిమా బడ్జెట్లు విపరీతంగా పెరిగి పోవడం వలనా, ప్రేక్షకుల అంచనాలు అతిగా ఉండడం వలనా, రంగంలో తీవ్రమైన పోటీ నెలకొనడం వలన అంత పెద్ద హిట్లుగా పరిగణించబడడం లేదు.మళ్ళీ పది సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నెం.150, 2017 జనవరి 11 న విడుదల అయ్యి చిరు రీ ఎంట్రీ ఘనం గా సాగింది..ఆ సినిమా లో చిరు చాలా చలాకీగా నటించాడు,బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినా తగ్గలేదని నిరూపించాడు. తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చును. అంతకు ముందు హీరోల సినిమాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటి సారిగా ‘బ్రేక్ డ్యాన్స్’ చేసిన ఘనత చిరంజీవి కే దక్కుతుంది. దక్షిణాది హీరోలలో డాన్స్ చేయడంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు.
ఇలా ఎన్నో సినిమాలో నటించి ఎప్పుడు రామ్ చరణ్ నిర్మాతగా సైరా సినిమాను అభిమానుల ముందుకు తెస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటించగా, మరో ముఖ్యమైన యువరాణి పాత్రలో తమన్నా నటించారు. తాజాగా ఆమె ఈ విషయాన్ని గురించి ప్రస్తావించారు. ఈ సినిమా కథా నేపథ్యం కారణంగా తెరపై నేను విభిన్నమైన వేషధారణతో కనిపిస్తాను. నా పాత్రకి తగినట్టుగా నేను భారీ లెహెంగాలను ధరించాను. నేను ధరించిన వస్త్రాలను చిరంజీవిగారి పెద్ద కుమార్తె సుస్మిత .. ప్రముఖ డిజైనర్ అంజూ మోదీతో కలిసి డిజైన్ చేశారు. సినిమా పరంగా నేను ఇంతవరకూ ధరించిన అత్యంత ఖరీదైన వస్త్రాలు ఇవే. నా వస్త్రధారణ నా పాత్రకి మరింత ప్రత్యేకతను తీసుకొస్తుంది. ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. నా పాత్ర కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.