కొర్పన: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా కొర్పన ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను, ట్రక్ ఢీకొనడంతో వ్యాను డ్రైవర్ సహా 11 మంది మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఏడుగురు మహిళలు, మూడేళ్ల చిన్నారి ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 15 మంది ప్రయాణికులతో కూడిన వ్యానును కొర్పన నుంచి వనీ రోడ్డు వైపుగా వస్తున్న ట్రక్ వేగంగా వచ్చి ఢీకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
previous article
307 పరుగులకు టీమిండియా ఆలౌట్ ఆసీస్ లక్ష్యం 323
Related Posts
- /No Comment
ఆర్కేఎస్ భదౌరియా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్..!
- /No Comment