త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన తాజా చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. హారిక అండ్ హాసిని వారితో కలిసి గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడీగా పూజా హెగ్డే ను తీసుకున్నారు. అల్లు అర్జున్ సరసన ఆమెకి ఇది రెండవ సినిమా.
అల్లు అర్జున్ కి స్టైలీష్ స్టార్ అనే పేరు వుంది. అందుకు తగినట్టుగానే ఈ సినిమాలో ఆయన మరింత స్టైల్ తో కనిపించనున్నాడని అంటున్నారు. ఆయన డ్రెస్సింగ్ .. హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా వుంటాయని చెబుతున్నారు. లుక్ విషయంలో ఆయనను పూర్తి కొత్తగా త్రివిక్రమ్ చూపించనున్నాడని అంటున్నారు. లవ్ .. రొమాన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిస్తూ ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో ఆయన తల్లి పాత్రలో ‘టబు’ కనిపించనున్న సంగతి తెలిసిందే.