కేటీఆర్ పోటుగాడైతే వెంటనే రావాలి: పొన్నం ప్రభాకర్

బిడ్డలకు అన్యాయం జరిగితే తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుందో ఓ తండ్రిగా తనకు తెలుసునని వ్యాఖ్యానించిన కేటీఆర్, నిజంగా పోటుగాడే అయితే, ఇంటర్ బోర్డు వద్దకు వచ్చి, అధికారులను నిలదీయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం బోర్డు ముట్టడికి బయలుదేరిన పొన్నం ప్రభాకర్ ను పోలీసులు అడ్డుకోగా, ఆయన మండిపడ్డారు.

ఆపై మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడని, ఆయన వాయిస్ కు డిమాండ్ అధికమని, ఆయన వచ్చి నష్టపోయిన విద్యార్థులను ఆదుకునే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. గ్లోబరినా సంస్థకు కేటీఆర్ కు సంబంధం ఉందని ఆరోపించిన పొన్నం, విద్యామంత్రితో రాజీనామా చేయించాలని, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని అన్నారు. బోర్డు సెక్రటరీపై, గ్లోబరినాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Response