కొత్త లుక్ తో పవన్ కళ్యాణ్…

బాలీవుడ్ లో ఆ మధ్య అభిమానుల ముందుకు వచ్చిన సినిమా ‘పింక్’. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తమిళంలో అజిత్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేయగా, అక్కడ కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి దిల్ రాజు రంగంలోకి దిగాడు. బోనీకపూర్ తో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మించనున్నాడు.ఈ సినిమాలో హీరోగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్నాడంటూ టాలీవుడ్ లో వార్తలు వచ్చాయి.

Image result for pawan kalyan

ఆ తరువాత ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నాడనే విషయం ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి పవన్ అందుకోనున్న పారితోషికం గురించిన చర్చలు ఫిల్మ్ నగర్లో జోరుగా జరగడం విశేషం. ఈ సినిమాకి పారితోషికంగా ఆయన 40 కోట్లను అందుకోనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు దర్శకుడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కించే దిశగా పనులు జరుగుతున్నాయి. మరి ఈ సినిమా లో ఏ గెటప్ తో అభిమానుల ముందుకు వస్తాడో అన్ని తన అభిమానులు ఎంతగానో ఎదురు చేస్తున్నారు.

Leave a Response