కేసీఆర్‌ పాలనకు ఘోరీ కట్టాలి

కేసీఆర్‌ కుటుంబంపై టీపీసీసీ ఛీప్‌ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించిన వారిపై కుట్ర పూరితంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్‌ కుటుంబ పాలనకు ఘోరీ కట్టాలని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లించి కేసీఆర్‌ రుణం తీర్చుకుంటామని వ్యాఖ్యానించారు.

ప్రజల మనోభావాలకు అనుగుణంగానే అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ ముఖ్య నేతలపై వరుస కేసులు ఆ పార్టీలని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీని నేరుగా ఎదుర్కొనే ధ్యైర్యం లేకే కేసీఆర్‌ ఇలా అక్రమంగా కేసులు పెడుతున్నారని కాంగ్రెస్‌ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Leave a Response