విజయ్ దేవరకొండ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆయన కెరీర్‌కు ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం ఎంత మైలేజ్‌ని ఇచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందులో మెడికల్ స్టూడెంట్‌గా నటించారు విజయ్. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే… విజయ్ హీరోగా ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడలోని ఓ మెడికల్ కాలేజీలో జరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా కాకుండా ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించనున్న సినిమా రెగ్యులర్ షూట్ జనవరిలో స్టార్ట్ కానుందని టాక్.
previous article
‘అమ్మాయిలు… ఇది మీ కోసమే!’