అది నా జీవితాన్ని మార్చేసింది: అల్లు అర్జున్‌

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కెరీర్‌లో ‘ఆర్య’ ఓ మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం. ‘ఫీల్‌ మై లవ్‌..’ అంటూ బన్నీ యువత మనసు దోచుకున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై నేటికి పదిహేను సంవత్సరాలు కావొస్తోంది. ఈ సందర్భంగా బన్నీ ఆ సినిమాను గుర్తుచేసుకుంటూ సోషల్‌మీడియాలో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు.
‘ఇప్పటికీ నేను అంతే ప్రేమను ఫీలవుతున్నాను. నా జీవితంలో ‘ఆర్య’ మ్యాజికల్‌ మూవీ. ఇది నా జీవితాన్ని మార్చేసింది. సినిమా విడుదలై నేటికి పదిహేనేళ్లు పూర్తవుతోందంటే నమ్మలేకపోతున్నాను. ధన్యవాదాలు సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌, రత్నవేలు, దిల్‌రాజు. అన్నింటికి మించి నన్ను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని పేర్కొంటూ ‘ఆర్య’ పోస్టర్‌ను పంచుకున్నారు.
ఈ సినిమాకు సీక్వెల్‌గా 2009లో సుకుమార్‌, బన్నీ కాంబినేషన్‌లో ‘ఆర్య 2’ వచ్చింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో చిత్రం రాబోతోంది. ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. మరి వీరిద్దరూ హ్యాట్రిక్‌ కొడతారేమో వేచి చూడాలి.
ప్రస్తుతం అల్లు అర్జున్‌.. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Leave a Response