టాలీవుడ్లో నవంబర్ 15న విడుదల అవుతున్న సినిమా ‘యాక్షన్’. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన సరికొత్త పోస్టర్ సినీ అభిమానుల్లో ఈ సినిమా పట్ల మరింత ఆసక్తిని పెంచుతుంది. చిత్రయూనిట్ గురువారం ‘యాక్షన్’ సినిమాలోని విశాల్ ఉన్న ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో విశాల్ ఒక తీవ్రవాది గెటప్‌లో ఉండి, అతని చేతికి సంకెళ్లు వేసి జవాన్లు పట్టుకొని తీసుకొస్తున్నారు. ఈ లుక్‌ని చూసిన నెటిజన్లు ఇంతకీ ఈ సినిమాలో విశాల్ హీరోనా, విలనా.. లేదా డబుల్ రోల్ ఏమైనా ప్లే చేస్తున్నాడా? అనే పోస్టులు పెడుతున్నారు. పోస్టర్‌తోనే సంచలనం అవుతున్న ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్, తమన్నా, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు నటించిన ఈ సినిమాకు సుందర్. సి దర్శకత్వం వహించారు.
previous article
పాత కాలం సినిమాలో ప్రభాస్..
next article
అవలీలగా డబుల్ సెంచరీ..
Related Posts
- /No Comment
మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో…
- /No Comment