రామ్ గోపాల్ వర్మ ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ టైటిల్‌తో సినిమా తీశారు. సెన్సార్ బోర్డు ఆ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడం. దాంతో నవంబర్ 29న సినిమాని విడుదల చెయ్యడానికి ఆయన చేసుకున్న ఏర్పాట్లన్నీ వృథా అయ్యాయి. దీంతో ఒక మెట్టు దిగారు వర్మ. టైటిల్‌ను ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ అని మార్చారు. యథార్థ ఘటనలను చిత్రీకరించడం వేరు, వ్యక్తుల్ని పరిహసించే విధంగా ఆ పాత్రల్ని చిత్రించడం వేరు. వర్మ సృష్టించిన పాత్రలు ఈ రెండో రకానికి చెందుతాయని ఎవరికైనా అనిపిస్తాయి. ఆ విషయం ఆయనకూ తెలుసు. ఎవరి నుంచి ఎన్ని అభ్యంతరాలొచ్చినా, తనకు తోచింది తియ్యడం ఆయన సహజ గుణం కాబట్టి, కాంట్రవర్సీతో ప్రచారాన్నీ, తద్వారా డబ్బునూ సంపాదించే అలవాటు ఉంది కాబట్టి ఆయన ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉంటారు. ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా విడుదల కు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమాలో కొన్ని సన్నివేశాలను కత్తిరిచిన సెన్సార్ బోర్డు సినిమాకు సర్టిఫికెట్ ను జారీచేసినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా విడుదల తేదీని ఖరారు చేయడమే మిగిలింది.
- /
- /admin
- /No Comment
- /29 views
- /amma rajyamlo kadapa beddlukamma rajyamlo kadapa reddlurgv
వర్మ లైన్ క్లియర్..!
previous article
టాలీవుడ్ స్టార్స్ వెబ్ సిరీస్‌లో…
next article
నెల్లూరులో వైసీపీ యుద్ధం..!