చిరంజీవి సరసన త్రిష..!

త్రిష తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా కొంత కాలం క్రితం ఒక వెలుగు వెలిగిన సంగతి తెల్సిందే. ఈ రెండు పరిశ్రమలో కొత్త కథానాయికల పోటీ ఎక్కువ కావడంతో ఆమె వెనుకబడిపోయింది. అయితే ఈ మధ్య వచ్చిన ’96’ మూవీ సూపర్ హిట్ కావడంతో ఆమెకి మళ్ళి అవకాశాలు పెరిగాయి.అక్కడే కాదు ఇక్కడ మన టాలీవుడ్ లోను త్రిష క్రేజ్ అలాగే వుంది. చిరంజీవి తాజా చిత్రం అయినా 152వ సినిమాలో అవకాశం దకించుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సరసన ఖాయమని చెప్పుకుంటున్నారు. చిరంజీవి సరసన త్రిష ‘స్టాలిన్’ సినిమా తరువాత కలిసి నటించే అవకాశం రాలేదు. ఈ అవకాశాన్ని త్రిష ఎలా సద్వినియోగం చేసుకుంటుందో వెచ్చి చూడాల్సిందే.

Tags:trisha

Leave a Response