ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సెల్వమణి నియోజకవర్గం నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ‘బియ్యం ‘ పథకాన్ని ప్రవేశపెట్టారు. కిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తెచ్చి కిలో బియ్యం తీసుకు వెళ్లాలంటూ ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా రోజా సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. నియోజకవర్గం లో ప్రతి మున్సిపాలిటీ, పంచాయతీ, వార్డు పరిశుభ్రంగా ఉండాలని, ఇందుకోసం ఎక్కడ ప్లాస్టిక్ కనిపించినా ఏరివేయాలని పిలుపునిచ్చారు. ‘స్వచ్ఛ నగరి’ నియోజకవర్గాన్ని సాధించి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం, అందరికీ ఆదర్శంగా నిలుద్దాం అని సూచించారు.
previous article
ఇంక నాకు ఓపిక లేదు…?
next article
బ్రేకప్ గురించి ఇలియానా అభిప్రాయం…
Related Posts
- /No Comment
త్రిష అవుట్ కాజల్ ఇన్
- /No Comment