బాలీవుడ్ యాంగ్ హీరోలు కమర్షియల్ సినిమాలతో పాటు వాస్తవానికి దగ్గరగా ఉండే రియలిస్టిక్ పాత్రల్లో కూడా కనిపించేందుకు ఇటీవలి కాలంలో కూడా సిద్ధపడుతున్నారు. డీ గ్లామర్ క్యారెక్టర్‌లో కనిపించడానికి సైతం సై అంటున్నారు మన బాలీవుడ్ హీరోలు. కష్టపడి నటించి పాత్రకు జీవం పోస్తున్నారు మన హీరోలు. బాలీవుడ్ స్టార్ హీరో, గ్రీకు వీరుడులాంటి హృతిక్ రోషన్ తొలిసారి అలాంటి పాత్రతో అభిమానుల ముందుకు వస్తున్నాడు. గణిత శాస్త్రవేత్త ఆనంద్ జీవిత కథ ఆధారంగా వికాస్ భల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ 30
సినిమాలో హృతిక్ హీరోగా తెరకెక్కుతుంది. ఎక్కడో మారుమూల ఊళ్లో పుట్టి, ఎన్నో కష్టాలు పడి గణిత శాస్త్రవేత్తగా ఎదగడం, ఐఐటీలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం వంటి అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకులు. ఆయన జీవితంలో ఎంతో కష్టం ఉందని తెలియజేస్తూ తాజాగా హృతిక్ ఓ ట్వీట్ ద్వారా మన అందరికి తెలియజేసాడు. ఆనంద్ జీవిత ప్రయాణంలో అప్పడాలు అమ్ముకునే ఘట్టం చాలా కీలకం. ఆ సమయంలో ఆయన పడిన భావోద్వేగమే.. తరువాత ఆయన సాధించిన విజయాలకు కారణమైంద
ని హృతిక్ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ కూడా ఎదురుచూస్తుంది.